సంధులు
సంధి : పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుట సంధియగు.
వివరణ : పూర్వస్వరం
అనగా మొదటి పదం చివరి అచ్చు, పరస్వరం అనగా రెండవ పదం మొదటి అచ్చు
కలిసినప్పుడు
పూర్వస్వరం లోపించి పరస్వరం ఒకటే మిగులుతుంది.దీనిని సంధి అంటారు.
సంధులు రకాలు :
వర్ణాలబట్టి
సంధులు రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి.
భాషనిబట్టి సంధులు రెండు రకములు: 1. సంస్కృత సంధులు, 2.తెలుగు సంధులు.
తెలుగు సంధులు : ఇవి రెండు రకములు: 1.అచ్సంధి, 2.హల్సంధి
అచ్చు సంధులు :
1. అకార సంధి: అత్తునకు సంధి బహుళముగానగు. (ఇక్కడ బహుళము అనగా నాలుగు రకాల అని అర్థం) అత్వ సంధి నాలుగు విధాలుగా జరుగుతుంది.
I) ప్రవృత్తి : ఈ సందర్భంలో సంధి నిత్యము జరుగుతుంది
ఉదా: మల్ల+అన్న =మల్లన్న.
II) అప్రవృత్తి(నిషేధం) : అప్రవృత్తి అంటే వ్యాకరణ నియమం పాటించకపోవడం
ఉదా: అక్క+ఇచ్చెను=అక్కయిచ్చెను.
III)విభాష: సంధి ఒకసారి జరుగుతుంది, ఒకసారి జరగకపోవచ్చు
ఉదా: మేన+అల్లుడు=మేనల్లుడు/
మేన+అల్లుడు=మేనయల్లుడు
IV) అన్య విధము: వ్యాకరణ సూత్రం పాటించకుండా వేరొక విధంగా సంధి జరుగుతుంది
ఉదా: ఒక + ఒక= ఒకానొక
2. ఇకార సంధి: ఇత్తునకు సంధి
వైకల్పికముగానగు.
ఉదా: ఏమి + అనిరి =ఏమనిరి.
3. ఉకార సంధి: ఉత్తునకు సంధి నిత్యం
ఉదా: రాముడు+అతడు=రాముడతడు.
4. యడాగమ సంధి: సంధిలేని చోట స్వరంబు కంటే
పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
ఉదా: మీ+ఇల్లు=మీయిల్లు
5. ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితంబు
పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఉదా: ఏమి+ఏమి=ఏమేమి.
చివర + చివర= చిట్టచివర
కడ + కడ = కట్టకడ
హల్లు సంధులు : ను
6. గసడదవాదేశ సంధి:
సూత్రం 1: ప్రథము మీది
పరుషములకు గ-స-డ-ద-వలు ఆదేశమగు.
ఉదా:
వాడు+కొట్టె=వాడుగొట్టె
నిజము+తెలిసి = నిజముదెలిసి
సూత్రం 2: ద్వంద్వ సమాసంలోని క,చ,ట,త,ప లకు క్రమంగా గ,స,డ,ద,వ లు
వస్తాయి.
ఉదా: తల్లి+తండ్రులు= తల్లిదండ్రులు
7. సరళాదేశ సంధి:1. ద్రుత ప్రకృతికము
మీది పరుషములకు సరళములగు
2. ఆదేశ సరళములకు ముందున్న ద్రుతమునకు బిందు సంశ్లేషలు విభాసలగు.
ఉదా:పూచెన్+కలువలు=పూచెన్గలువలు
8. ద్విరుక్తటకారాదేశ సంధి:
కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ
' లకు
అచ్చు పరంబగునపుడు
ద్విరుక్త టకారంబగు.
ఉదా: నడు+ఇల్లు=నట్టిల్లు
చిఱు + ఎలుక = చిట్టెలుక
9. పుంప్వాదేశ సంధి: కర్మధారయము నందు మువర్ణకంబునకు పుం-పు
లగు
ఉదా: సరసము+మాట=సరసపుమాట
ముత్యము+చిప్ప=ముత్యపుచిప్ప
10. టుగాగమ సంధి:
కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
ఉదా: పేరు+ఉరము=పేరుటురము
నిగ్గు + అద్దము = నిగ్గుటద్దము.
11. రుగాగమ సంధి: కర్మధారయమునందు పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు
రుగాగమంబగు (పేద,బీద,ముద్ద,బాలింత,జవ,కొమ,గొడ్డ...మొదలయినవి.)
ఉదా: పేద+ఆలు=పేదరాలు
12. నుగాగమ సంధి:
సూత్రం 1: ఉదంతంబులగు స్త్రీ సమంబులకు, పు,ంపులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు
నుగాగమంబగు.
ఉదా:
సొగసు+తనము=సొగసుందనము
సూత్రం 2: ఉదంతంబగు తద్ధర్మార్థ విశేషణములకు
అచ్చు పరంబగునప్పుడు నుగాగమంబగు
ఉదా:
చేయు+అతడు =చేయునతడు
వచ్చు+అప్పుడు =వచ్చునప్పుడు
సూత్రం 3:
షష్ఠీ సమాసము నందు ఉకార, ఋకారములకు అచ్చు పరమగునపుడు నుగాగమంబగు.
ఉదా: విధాతృ+ఆనతి =విధాతృనానతి
13. పడ్వాది సంధి:
పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణకంబునకు లోపము, పూర్ణ బిందువులు
విభాషనగు.
ఉదా: భయము+పడు=భయపడు
14. త్రిక సంధి: 1.ఆ,ఈ,ఏ లను త్రికములు అంటారు.
2.త్రికము మీది అసంయుక్త హల్లునకు ద్విరుక్తంబు
బహుళంబుగానగు.
3.ద్విరుక్తంబగు హల్లు పరంబగునప్పుడు
ఆచ్ఛికంబైన దీర్ఘము హ్రస్వంబగు
ఉదా:
ఆ+కడ = అక్కడ
(ఇక్కడ 'ఆ'
అనునది .త్రికము, 'క' అనునది అసంయుక్త హల్లు. కనుక ద్విరుక్తంబు
వచ్చిఆ+క్కడ ఐనది.
ద్విరుక్తంబగు 'క్క' పరంబుగనప్పుడు 'ఆ'
దీర్ఘం కాస్త హ్రస్వంబై 'అ'
గా మారి అక్కడ అయ్యింది.)
15. ప్రాతాది సంధి:
సమాసంబులనందు ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు
బహుళంబుగానగు.(ప్రాత,క్రొత్త,లేత,క్రిందు,మీద,పువ్వు,కెంపు,చెన్నుమొదలయినవి.)
ఉదా:
క్రొత్త+గండి=క్రొగ్గండి.
16.లు-ల-న
ల సంధి: లు-ల-న లు పరమైనపుడు ఒకానొకప్పుడు మువర్ణానికి లోపము దాని
పూర్వ
స్వరానికి దీర్ఘము విభాషగా వస్తాయి.
ఉదా: దేశము+లు=దేశాలు
Thank you so much !!!
ReplyDeleteThis was very helpful for me.....tq!
thank you
Delete